Friday, May 3, 2024

గోవాలోకెమెరా కంట చిక్కిన నల్ల చిరుత

- Advertisement -
- Advertisement -

పనాజీ: గోవాలోని మొల్లెం వద్ద ఉన్న అభయారణ్యంలో అమర్చిన రహస్య కెమెరా కంట అరుదైన ఒక నల్ల చిరుత చిక్కింది. కాగా.. ఈ నల్ల చిరుతపులి కదలికలను పసిగట్టేందుకు అడవిలో మరిన్ని కెమెరాలను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు గోవా అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే సోమవారం తెలిపారు. దక్షని గోవాలోని భగవాన్ మహావీర్ అభయారణ్యంలో అమర్చిన కెమెరాలో ఏప్రిల్ 25న చిక్కిన నల్ల చిరుతపులి ఫోటోను రాష్ట్ర అటవీ శాఖ ఆదివారం మీడియాకు విడుదల చేసింది. అభయారణ్యంలో నడుస్తూ వెళుతుండగా ఈ నల్ల చిరుత కెమెరా కంట చిక్కింది. కెమెరా కంట్లో నల్ల చిరుత చిక్కడం అపురూప దృశ్యమని, దీన్ని కదలికలను గుర్తించడానికి మరిన్ని కెమెరాలను అమర్చవలసిందిగా అటవీ శాఖను ఆదేశించామని ఆయన మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News