Thursday, May 2, 2024

ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ ను ప్రారంభించిన బ్లాక్‌బెర్రీ..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ నేడు నూతన బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఇంజినీరింగ్‌ మరియు ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని భారతదేశంలోని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ ప్రపంచశ్రేణి ఇంజినీరింగ్‌ కేంద్రం, భారతదేశపు అత్యుత్తమ ఎంబీడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను నియమించుకోవడం ద్వారా భావితరపు సాఫ్ట్‌వేర్‌ నిర్వచిత వాహనాలు (ఎస్‌డీవీలు) నిర్మించడంలో సహాయపడటంతో పాటుగా ఇతర ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరిశ్రమలలో అత్యాధునిక ఆవిష్కరణలను సైతం కంపెనీ యొక్క నమ్మకమైన, సేఫ్టీ సర్టిఫైడ్‌ బ్లాక్‌బెర్రీ క్యుఎన్‌ఎక్స్‌ (BlackBerry® QNX®)ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియో మరియు అవార్డులు గెలుచుకున్న(award-winning) వాహన సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లాక్‌బెర్రీ ఐవీ (BlackBerry IVY™)వై సహాయంతో చేయనుంది.

బెంగళూరులో మార్చి 29న జరుగనున్న కంపెనీ యొక్క వార్షిక టెక్‌ ఫోరమ్‌ ఇండియా(TechForum India)కు ముందుగా, తమ మిషన్‌ క్రిటికల్‌ ఎంబీడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ మరియు ఇంజినీరింగ్‌ సేవల కోసం భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు వీలుగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తగిన ప్రణాళికలను బ్లాక్‌ బెర్రీ వెల్లడించింది. 2023 సంవత్సరాంతానికి, హైదరాబాద్‌ ఫెసిలిటీ – కెనడా తరువాత అంతర్జాతీయంగా బ్లాక్‌బెర్రీ యొక్క ఐఓటీ డివిజన్‌లలో రెండవ అతిపెద్ద కేంద్రంగా నిలువనుంది. ఇక్కడ 100మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు విస్తృత శ్రేణి సాంకేతిక స్థాయిలు మరియు నైపుణ్యాలతో (across a wide range of technology positions and skill sets)పనిచేయనున్నారు. వీరిలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఇంటిగ్రేషన్‌ మరియు సర్వీస్‌ డెలివరీ వంటివి ఉంటాయి.

బ్లాక్‌బెర్రీ ఐఓటీ ప్రెసిడెంట్‌ మత్తియాస్‌ ఎరిక్‌సన్‌ మాట్లాడుతూ ‘‘నైపుణ్యాలు మరియు ఆవిష్కరణలలో కొనసాగుతున్న బ్లాక్‌బెర్రీ యొక్క ప్రస్తుత పెట్టుబడులలో నేడు మరో మైలురాయిని చేరుకున్నాము. ఇది ప్రపంచశ్రేణి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేటర్లకు నిలయంగా ఇండియా యొక్క ప్రాధాన్యతను వెల్లడిస్తుంది. బ్లాక్‌బెర్రీ ఐఓటీ యొక్క అంతర్జాతీయ ఆవిష్కరణ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో విస్తరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఇది వినియోగదారులు మరియు భాగస్వాములకు సేవలను అందించడంలో మా నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా ఐఓటీ సాఫ్ట్‌వేర్‌ లీడర్‌గా మా వృద్ధిని మరింత వేగవంతం చేయనుంది. మరీ ముఖ్యంగా ఆటోమోటివ్‌ రంగంలో ఈ వృద్ధి ని వేగవంతం చేయనుంది’’ అని అన్నారు.

ఆవిష్కరణ, ఎంబీడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మరియు ఇంజినీరింగ్‌ సేవల కోసం బాధ్యత వహించే ఈ బృందాలు తొలుత క్యుఎన్‌ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ (ఎస్‌డీపీ) ఇవాల్యుయేషన్‌ హార్డ్‌వేర్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ ను డిజైన్‌ చేసేందుకు మరియు సురక్షితమైన , భద్రమైన మరియు రియల్‌టైమ్‌ పనితీరుతో కూడిన సిస్టమ్స్‌ అభివృద్ధి వేగవంతం చేసేందుకు వినియోగించనున్నారు. దీనిలో క్యుఎన్‌ఎక్స్‌ యాక్సలరేట్‌ (QNX® Accelerate) కార్యక్రమం కూడా భాగంగా ఉంటుంది. ఇది క్యుఎన్‌ఎక్స్‌ను క్లౌడ్‌ (QNX® in the Cloud)లో అందించడంతో పాటుగా ఉత్పత్తి అభివృద్ధి వేగవంతం చేసి, ఆటోమోటివ్‌, వైద్య పరికరాలు, ఇండస్ట్రీయల్‌ కంట్రోల్స్‌, రోబొటిక్స్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, హెవీ మెషీనరీ సహా అత్యంత కీలకమైన పరిశ్రమల కోసం మార్కెటింగ్‌ సమయం సైతం తగ్గిస్తుంది.

బ్లాక్‌బెర్రీ ఐవీవై సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ను 2023 లోనే చేయడానికి ప్రణాళిక చేశారు.ఇది డెవలపర్లు, భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈఎంలను ఆవిష్కరణ సైకిల్‌కు సన్నిహితంగా తీసుకురావడంతో పాటుగా ఆన్‌ వీల్‌ మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వినియోగించి ఆప్టిమైజ్డ్‌ డాటా ప్రాసెసింగ్‌ వంటి ప్రయోజనాలను సైతం అందించనుంది.

బ్లాక్‌బెర్రీ క్యుఎన్‌ఎక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 215 మిలియన్‌ వాహనాలలో (215 million vehicles worldwide) అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా 45కు పైగా విభిన్నమైన ఓఈఎంల ఉత్పత్తిలో సైతం జొప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు ఆటో టియర్‌ 1 సరఫరాదారులు సైతం దీనిని వినియోగిస్తున్నారు. ఈ సమాచారం ఎస్‌డీవీ ఆవిష్కరణలో బ్లాక్‌బెర్రీ యొక్క నిబద్ధతను వెల్లడిస్తుం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News