Tuesday, May 14, 2024

బిజెపి గూటికి ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కమలం కండువా కప్పుకున్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన చేరారు. బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాపూరావుకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు. దీంతో అలకబూనిన ఆయన పది రోజుల కితం కాంగ్రెస్‌లో చేరగా అక్కడ కూడా టికెట్ దక్కకపోవడంతో మళ్లీ బిజెపిలో చేరి మూడో జాబితాలో టికెటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మునుగోడు కీలక నేత చలమల కృష్ణారెడ్డి కమలం బాట ః
అదే విధంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత చలమల కృష్ణారెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా చివరకు పాల్వాయి స్రవంతికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఆమె గెలుపు కోసం కృషి చేశారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని భావిస్తే ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకే అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. చివరకు బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి మునుగోడు టికెట్ కేటాయింపు హామీతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News