Sunday, April 28, 2024

డబ్లూహెచ్‌వోలో బంగ్లా ప్రధాని కుమార్తె సైమా వాజెద్ కు కీలక పదవి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లూహెచ్‌వో) లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ కీలక పదవి చేపట్టనున్నారు. డబ్లూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్ డైరెక్టర్‌గా వాజెద్ నామినేట్ అయ్యారు. ఈమేరకు బుధవారం జరిగిన డబ్లూహెచ్‌వో రీజినల్ కమిటీ 67 వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి సైమా వాజెద్‌తోపాటు డబ్లూహెచ్‌వో సీనియర్ అధికారి డాక్టర్ శంబు ప్రసాద్ ఆచార్య కూడా పోటీ పడ్డారు. ఆయనను నేపాల్ ప్రతిపాదించింది. ఈ క్రమం లోనే ఢిల్లీలో బుధవారం జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ చేపట్టారు. ఇందులో వాజెద్‌కు అనుకూలంగా 8 ఓట్లు వచ్చాయి. ఆచార్యకు రెండు ఓట్లు వచ్చాయి. దీంతో వాజేద్‌ను నామినేట్ చేస్తున్నట్టు కమిటీ తీర్మానించింది.

వచ్చే ఏడాది జనవరి 2227 మధ్య జెనీవాలో జరిగే 154 వ డబ్లుహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమె ఎన్నికను ఆమోదించనున్నారు. 2024 ఫిబ్రవరి 1 నుంచి వాజెద్… రీజినల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ ప్రకటనలో వెల్లడించింది. ఐదేళ్ల పాటు ఆమెఈ పదవిలో కొనసాగనున్నారు. తన ఎంపికపై సైమా వాజెద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఆటిజం, న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్ వంటి వ్యాధులపై బంగ్లా జాతీయ అడ్వైజరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ రీజినల్ కమిటీలో బంగ్లాదేశ్, నేపాల్‌తోపాటు భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు , మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, త్రైమోర్ లెస్తే సభ్య దేశాలుగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News