Sunday, April 28, 2024

కలవర పెడుతున్న క్యాన్సర్

- Advertisement -
- Advertisement -

2022లో దేశంలో 22లక్షలకు పైగా కొత్త కేసులు
9.1 లక్షల మంది కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కేసులు,97 లక్షల మరణాలు
డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా కొత్త కేసులు వెలగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) తెలియజేసింది. అదేఏడాదిలో ఈ వ్యాధి కారణంగా 9.1 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో రొమ్మ క్యానర్లు ఎక్కువగా (1.92 లక్షలు) వెలుగు చూశాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల కేసులునమోదు కాగా 97 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.భారత్‌లో పురుషుల్లో పెదవినోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ఎక్కువగా నమోదయ్యాయి. మహిళల విషయంలో రొమ్ము, గర్భాశయ( సర్వైకల్), అండాశయానికి సంబంధించినవి ఎక్కువగా వెలుగు చూశాయి.

అత్యధిక మరణాలకూ ఈ రకాలే కారణమయినట్లు డబ్లుహెచ్‌ఓకు చెందిన ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఎఆర్‌సి) అంచనా వేసింది. దేశంలో 75 ఏళ్ల లోపు వారు ఈ వ్యాధిబారిన పడే ప్రమాదం 10.6 శాతంగా తేలింది. మరణం ముప్పు 7.2 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి 20 శాతం, 9.6 శాతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో వీటి బారిన పడే ప్రమాదం ఉంది.9 మంది పురుషుల్లో ఒకరు,12 మంది మహిళల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండువంతుల కొత్త కేసులకు, మరణాలకు ప్రధానంగా పది రకాలే కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో క్యాన్సర్ డాటాను ఈ సంస్థ విశ్లేషించింది. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ డాటాను విడుదల చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా సంభవించాయి. మొత్తం కేసుల్లో ఇవే 12.4 శాతం(24 లక్షలు)గా ఉన్నాయి.

మరణాల్లోను దీనిదే అత్యధికం(19 శాతం లేదా 18 లక్షలు). కొత్త కేసుల్లో 11.6 శాతం(23 లక్షలు)తో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మొత్త మరణాల్లో 7 శాతం దీనికి సంబంధించినవే. ‘సర్వైకల్’ ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల్లో ఈ రకానిది తొమ్మిదో స్థానం (3.84 లక్షలు). క్యాన్సర్, పాలియేటివ్ సంరక్షణ సేవలకు ప్రభుత్వాలు తగినంత ఆర్థిక తోడ్పాటునందించడం లేదని డబ్లుహెచ్‌ఓ ఆరోపించింది. కేవలం 39 దేశాలు మాత్రమే క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నాయని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News