Saturday, September 20, 2025

బొల్లారం రైల్వే స్టేషన్‌ వద్ద విషాదం.. రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ సిటిలోని బొల్లారం రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా గుర్తించారు. గాయపడిన మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News