Tuesday, September 23, 2025

పారిపోదామని.. విమాన టైర్‌లో కూర్చున్నాడు.. చివరకి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ్: అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul) నుంచి ఢిల్లీకి విమాన టైర్‌లో కూర్చొని ప్రయాణించాడు ఓ 13 ఏళ్ల బాలుడు. దాదాపు గంటన్నర సేపు విమాన టైర్‌లో అతడు దాక్కున్నాడు. ఎంతో అదృష్టంతో చావును జయించి మృత్యుంజయుడు అయ్యాడు. కాబూల్‌కు చెందిన బాలుడు ఇరాన్ పారిపోదామనే ఉద్ధేశంతో పొరపాటున ఢిల్లీ విమానం ఎక్కాడు. టికెట్, పాస్‌పోర్టు లేకపోవడంతో టైర్‌లో దాక్కున్నాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యాక అధికారులకు విషయం తెలిసింది. దీంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానం టైర్లతో పాటు బాలుడు కూడా లోపలికి వెళ్లి దాక్కుని ఉంటాడని.. అందుకే అతడు ప్రాణాలతో బయటపడగలిగాడని అధికారులు వివరించారు. లేదంటే 30 వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే వాడని తెలిపారు.

Also Read భారత్‌లో కనిపించని ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News