Sunday, April 28, 2024

బ్రెయిన్‌స్ట్రోక్‌తో 2050 నాటికి ఏటా కోటి మంది బలి

- Advertisement -
- Advertisement -

పేద, మధ్య ఆదాయ వర్గ దేశాలకు ముప్పు
స్ట్రోక్స్, లాన్సెట్ సంస్థల సంయుక్త పరిశోధన
ఇండియాలో పెద్ద ఎత్తున నివారణ చర్యలు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రక్తపుపోట్లతోతలెత్తే బ్రెయిన్‌స్ట్రోక్‌ల వల్ల 2050 నాటికి ఏటా దాదాపుగా కోటి మంది చనిపోతారని ఓ వైద్య నివేదికలో తెలిపారు. ప్రత్యేకించి బడుగు వర్గాలు, మధ్యఆదాయ తరగతి ప్రజలతో కూడిన ఎల్‌ఎంఐసి దేశాలకు ఈ బ్రెయిన్ పోటు ఎక్కువగా ప్రాణాంతకం కానుంది. స్ట్రోక్‌లను నివారించుకోవచ్చు. చికిత్సలకు కూడా వీలుంటుంది. అయితే సరైన రీతిలో వీటి పట్ల స్పందించలేకపోవడం రాబోయే సంవత్సరాలలో ఈ పరిణామం శాపంగా మారనుంది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, లాన్సెట్‌న్యూరాలజీ కమిషన్ (ఎల్‌ఎన్‌సి) సంయుక్త పరిశోధనలో తేలిన విషయాలను నాలుగు అధ్యయనాలుగా వెలువరించారు. ఇప్పుడు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.

2020 నాటికి రక్తపుపోటులతో ఏటా ఆరులక్షలకు పైగా జనం ప్రాణాలు వదులుతున్నారు. ఈ సంఖ్య 2050 నాటికి ఏటా కోటికి చేరుతుందని వెల్లడైంది. ప్రజలలో సకాలంలో రక్తపుపోట్లపై సరైన అవగావహన కల్పించడం, స్ట్రోక్‌లపై పర్యవేక్షణ, పెద్ద ఎత్తున సంరక్షణ, పునరావాస, సహాయక చర్యలు వంటి 12 సిఫార్సులతో నివేదిక వెలువరించారు. రక్తపుపోట్లతో ఇప్పుడు నెలకొన్న పెను సంక్షోభం గురించి పలు ప్రాంతాలలో జరిగిన మరణాలు , స్ట్రోక్‌లతో తలెత్తే బ్రెయిన్ స్తంభన పరిణామాల సంఖ్య పెరుగుదల వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం సాగింది.

ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల సమస్యను అధిగమించేందుకు వీలుంది. ఇక ఇండియాలో పరిస్థితి గురించి ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్లు స్పందించారు. పలు స్థాయిల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవల్సి ఉందని వివరించారు. దేశంలో అత్యవసర రీతిలో చికిత్సలకు వీలుగా నిర్ధేశిత స్థాయిలో అంబులెన్స్ కేర్ తరహా చికిత్సలకు వీలు కల్పించినట్లు తెలిపారు. దీనిపై ఐసిఎంఆర్ ప్రత్యేకించి దృష్టి సారించిందని వివరించారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవల్సి ఉంటుంది.

అందుబాటులో ఉండే మొబైల్, డిజిటల్ సౌకర్యాలతో , సరైన అవగావహన, శిక్షణలతో ప్రమాదకరమైన స్ట్రోక్‌ల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు వీలుంది. పలు ప్రాంతాలలో అందరిలోనూ బిపి ప్రధానమైన సమస్య అయింది. ఇదే తరువాతి దశల్లో అధికరక్తపుపోటుకు దారితీస్తుంది. దీనిని గుర్తించి దేశంలో ఏర్పాటు చేసిన ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇన్షియేటివ్ (ఐహెచ్‌సిఐ) చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. ఈ పద్ధతిలో దేశంలోని దాదాపు 20 లక్షల మంది హైపర్‌టెన్షన్ బాధితుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నారు. తరువాతి క్రమంలో చేపట్టిన ఆరోగ్యపరమైన చర్యలతో ఈ కేసులలో సగానికి సగం వరకూ బిపిని అదుపులోకి తీసుకుని వచ్చినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News