Tuesday, May 7, 2024

బిఆర్‌ఎస్ అంటే ‘భారత రైతు సమితి’ అని మరోసారి రుజువైంది

- Advertisement -
- Advertisement -
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయిందని వెల్లడించారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బిజెపి సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ తెలిపారు. సిఎం కేసిఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమేనన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం, యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News