Saturday, April 27, 2024

ప్రతిపక్ష పార్టీల సమావేశంపై మాయావతి సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఉమ్మడిగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులో సమావేశమైన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షంపై బిఎస్ పి పార్టీ అధినేత మయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కులతత్వ, పెట్టుబడిదారి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని విమర్శించారు. అటు భారతీయ జనతా పార్టీ(బిజెపి) కూడా ఎన్ డిఎ కూటమిని బలపరుస్తోందని చెప్పారు.

ఈ పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదని.. దళితులు, ముస్లీంలు, మైనార్టీల కోసం ఏమీ చేయలేదని ఆమె మండిపడ్డారు. అన్ని పార్టీలు ఒక్కటేనని.. కాంగ్రెస్ పార్టీ అయినా, బిజెపి పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి అధికారం చెలాయిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చరని అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు కూడా దళిత, ముస్లీం వ్యతిరేక విధానాలు కలిగిన పార్టీలన్నారు. ప్రతిపక్ష కూటమిలో బిఎస్ పి చేరకపోవడానికి ఇదే అతిపెద్ద కారణమని మయావతి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News