Thursday, December 7, 2023

పేదల సంక్షేమం కోసం బిఎస్పీ నిరంతరం పనిచేస్తుంది: ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను తక్షణమే ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్. ఎస్.ప్రవీణ్‌కుమార్ కోరారు. సిర్పూర్ ప్రాంతంలో వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో స్దానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చిన అమలు చేయకపోవడంతో ఆవర్గాల ప్రజలు అన్ని విధాలుగా నష్టం పోయారని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో బీఎస్పీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. సిర్పూర్ ప్రాంతంలో ఎమ్మెల్యే కోనప్ప కుటుంబం ఆగడాలకు చరమగీతం పాడాలన్నారు. దళిత బహుజనుల కోసం పనిచేస్తే తమపార్టీని రాష్ట్ర ఆదరించి మెజార్టీ స్ధానాల్లో గెలిపించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News