Sunday, September 21, 2025

దటీజ్ బుమ్రా.. తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: టీం ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి రోజు అదిపోయే బ్యాటింగ్ చేసింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసింది. అయితే రెండో రోజు భారత బ్యాటర్లు కాస్త తడబడ్డారు. 112 మాత్రమే జోడించి భారత్ ఆలౌట్ అయింది. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ చివరి బంతికి క్రాలీ స్లిప్‌లో ఉన్న కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో డక్కెట్(15), పోప్(19) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News