Tuesday, May 14, 2024

సివిల్స్ 20వ ర్యాంకర్‌కు బుర్రా వెంకటేశం అభినందనలు

- Advertisement -
- Advertisement -

Burra Venkatesam congratulates Civils 20th Ranker

మనతెలంగాణ/హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ ఫలితాలలో అలిండియా 20వ రాంక్ సాధించిన శ్రీజను బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో శ్రీజను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శ్రీజ తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తను రచించిన ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకాన్ని శ్రీజకు బహూకరించారు. అలాగే బిసి సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి శ్రీజను అభినందించారు.

అక్టోబర్ 28న సివిల్స్ విజేతలతో ముఖాముఖి

సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయం సాధించిన విజేతలతో అక్టోబర్ 28న రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2 గంటలకు సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయం. సాధించటం ఎలా అనే అంశంపై బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఆశావహులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని విజేతలు కావాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News