- Advertisement -
విజయవాడ నగరంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను, డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు విద్యార్థులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయిన బస్సు, ఓ బైక్‌ను ఢీకొని డివైడర్‌పైకి దూసుకెళ్లింది. సమీపంలోనే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, డ్రైవర్‌కు సీపీఆర్ చేసి, ఆసుపత్రికి తరలించారు. వారి సత్వర చర్యల వల్ల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -