Monday, May 6, 2024

చంద్ర బోస్ కు సినారె జీవిత సాఫల్యపురస్కారం

- Advertisement -
- Advertisement -

c narayana reddy lifetime achievement award applicationC Narayana Reddy Lifetime Achievement Award to Chandra Bose

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కాలం, శైలి ఏడైనా జనాలను ఒప్పించడమే మంచి కవి లక్షణమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బంజారా హిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో, జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డా సి. నారాయణ రెడ్డి సినీ జీవిత సాఫల్య పురస్కారం సుప్రసిద్ధ సినీ కవి చంద్ర బోస్ దంపతులకు ప్రదానం చేశారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడడుతూ యోగ్యత,దక్షత కలిగిన సినీ గేయ రచయిత చంద్ర బోస్ అని అన్నారు. సినారె ఓ సాహిత్య శిఖరంమని, 4 దశాబ్దాలు ఆయన ఇటు సినీ కవిగా, అటు భాషావేత్త గా జాతీయ స్థాయి లో కీర్తిని సంపాదించి పెట్టారని కొనియాడారు.

ఆయన బాటలో పయనిస్తూ చంద్రబోస్ ఎన్నో గొప్పఅనుభూతులను ఆయన పాటల ద్వారా కలిగించారని పేర్కొన్నారు. మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది..ఎదిగినకొద్ది ఓదగమని అంటూ అర్థాన్ని వివరించారు ..సినారె సాహితీ పురస్కారం అందుకోవడానికి అన్ని విధాలా సమర్థుడు చంద్ర బోస్ అని, ఆయన భార్య సుచిత్ర, భార్య భర్తలిద్దరూ సినీ రంగంలో సేవలు అందించడం చాలా అరుదైన విషమన్నారు. తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ చంద్ర బోస్ పాటలు ఇటు క్లాస్ ను అటు మాస్ ను అలరిస్తున్నాయి అన్నారు..

ఎన్నో సందేశాత్మక గీతాలను కూడా అందించి తెలుగు ప్రజల ఆదరణ పొందారు అని పేర్కొన్నారు..కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డా.ఎస్.పి.భారతి చంద్రబోస్ రచనా పటిమను ప్రశంసించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాపార వేత్త రవికాంత్, ప్రజా సంబంధాల అధికారి గిరిధర్,రామారావు,నరేందర్ ,తో పాటు పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News