Saturday, April 27, 2024

అనుమతి ఉంటేనే ప్రాజెక్టులపైకి…

- Advertisement -
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు ఆదేశం

ప్రాజెక్టుల నిర్వహణ పనులకూ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమై న ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగ్ డ్యాంల పైకి ఇంజనీర్లు, అధికారులు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా బోర్డు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అదే విధంగా ప్రా జెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బో ర్డు అనుమతి తీసుకోవాలని, బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలని పే ర్కొంది. ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నె ల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్‌పై వారంలో కార్యాచరణ రూపొందించాలని బోర్డు సూచించింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి పరిధిలోకి ఇవ్వండని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించిన విషయంపై రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ దుమారానికి కృష్ణాబోర్డు తాజాగా జారీ చేసిన ఆదేశాలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి.

కెఆర్‌ఎంబి పరిధిలోనికి నా గార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఇవ్వాలనే కేంద్రం ఆదేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఒకవైపున బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతలు మాజీ మంత్రులు టి.హరీష్‌రావు, ని రంజన్‌రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అ లాంటిదేమీలేదు, కెఆర్‌ఎంబికి ఆ రెండు ప్రాజెక్టులకు అప్పగించడానికి తాము అంగీకారం తెలపలేదని రాష్ట్ర నీటి  శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత రెండు రోజులుగా వరుసగా మీడియా సమావేశాల్లో వివరణలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీల నేతల మాటల యుద్దం జరుగుతూనే ఉంది. ఈ మాటల యుద్దం ముగిసిపోకముందే కృష్ణాబోర్డు జారీ చేసిన ఆదేశాలు ఈ రెండు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి వెళ్ళిపోయాయనే విమర్శలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని కొందరు ఇంజనీరింగ్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలోని మినిట్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు సంతకాలు చేశారని, ఈ సమావేశ మినిట్స్‌లో రెండు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే అంశం స్పష్టంగా ఉందని, అలాంటి మినిట్స్ ఉన్న ఫైల్‌పై సంతకాలు చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు తాము అంగీకరించలేదని చెప్పడంలో అర్ధంలేదని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు.

ఇదిలా ఉండగా ఇదే అంశంపై స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మినిట్స్‌లో ఉన్న అంశాలపై చర్చలు మాత్రమే జరుగుతాయని, దానిపై సమావేశంలో పాల్గొన్న అధికారులు తమ ప్రభుత్వంతో సంప్రదించి, ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాతనే అధికారికంగా ప్రకటన చేస్తామని, ప్రభుత్వ స్పందనను లేఖతో కెఆర్‌ఎంబికి తెలియజేస్తామని తమ అధికారులు బోర్డుకు స్పష్టంచేశారని, ఇదే అంశాన్ని బిఆర్‌ఎస్ నేతలు రాజకీయ లబ్దికోసమే వక్రీకరించి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి అంగీకరించినట్లుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలోనే కెఆర్‌ఎంబి రెండు తెలుగు రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాలు రాజకీయ రగడకు మరింత ఆజ్యంపోసినట్లయ్యిందని, ఇది ఎటువైపుకు దారితీస్తుందోనని అధికారవర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News