Thursday, May 2, 2024

రైతుబంధు కర్ణాటకలో ఇప్పించగలవా?

- Advertisement -
- Advertisement -
  • రేవంత్‌కు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సవాల్

కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలుపరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి చేసిన వాగ్దానాలను మరిచిపోవడం రేవంత్‌రెడ్డికి అలవాటేనన్నారు.

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం గురించి ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ప్రజలే రాజకీయ సన్యాసం ఇప్పిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 10 నుండి 12 స్థానాలకు మించి రావన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి మొన్న గెలిచిన పక్క రాష్ట్రం కర్ణాటకలో తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను అమలుపరచాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు తదితర పథకాలను ప్రజలకు అందజేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలో ప్రజలకు హామీలను ఇవ్వాలన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను అమలు చేయకుండా రాష్ట్రంలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. గతంలో సోనియాగాంధీని దెయ్యం అన్న రేవంత్ తన పబ్బం గడుపుకోవడానికి ఢిల్లీలో సోనియాకు గులాంగిరీ చేస్తున్నారన్నారు. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి వెళ్ళిన రేవంత్ అక్కడ పొడిచిందేమిలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు.

తిరిగి కొడంగల్‌లో గెలిచేది బిఆర్‌యస్ పార్టీ ఎమ్మెల్యేనేనని ఈ సందర్బంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసుధన్‌యాదవ్, మోహన్‌రెడ్డి, ప్రమోద్‌రావ్, నర్వోత్తంరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, దౌల్తాబాద్ ఎంపిపి విజయ్‌కుమార్, జడ్‌పిటిసి కోట్ల మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News