Monday, April 29, 2024

అయోధ్య స్వామీజీ, అమిత్ మాల్వీయపై తమిళనాడులో ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

చెన్నై: సనాతన దర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తలను నరికివేస్తే రూ. 10 కోట్ల బహుమానం ఇస్తానని ప్రకటించిన అయోధ్య స్వామీజీపై తమిళనాడు పోలీసులు బుధవారం(సెప్టెంబర్ 6) కేసు నమోదు చేశారు.

అయోధ్యలోని తసప్వి ఛావని ఆలయ స్వామీజీ రామచంద్ర దాస్ పరమహంస ఆచార్యపై మదురై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే అయోధ్య స్వామీజీ ప్రసంగాన్ని వార్తగా రాయడమేగాక స్వామీజీ వీడియోను మొదటగా పోస్టు చేసిన ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు పీయుష్ రాయ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

డిఎంకె మదురై విభాగం కన్వీనర్ జె దేవసేనన్ ఇచ్చిణ ఫిర్యాదు ఆధారంగా అయోధ్య స్వామీజీపైన, జర్నలిస్టు పీయుష్ రాయ్‌పైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మదురై పోలీసులు తెలిపారు.

కాగా..సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించినందుకు బిజెపి ఐటి సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వీయపై తిరుచిరాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుచిరాపల్లి దక్షిణ డిఎంకె విభాగం కన్వీనర్ కెఎవి దినకరన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మాన్ని పాటించే భారత్‌లోని 80 శాతం మంది ప్రజల మారణకాండకు ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారంటూ అమిత్ మాల్వీయ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని దినకరన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉదయనిధికి పా రంజత్ మద్దతు:

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ దర్శకుడు పా రంజిత్ సమర్థించారు. బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే ఉదయనిధి స్టాలిన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధి స్టాలిన్ ప్రకటన శతాబ్దాలుగా సాగుతున్న కులనిర్మూలన ఉద్యమానికి మూల సిద్ధాంతమని రంజిత్ తెలిపారు. కుల, లింగ వివక్ష వంటి అమానవీయ విధానాలు సనాతన ధర్మంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News