Wednesday, April 30, 2025

అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ కుట్ర…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: వివేకా హత్య కేసులో సిబిఐ ఏకపక్షంగా విచారణ చేస్తోందని కడప మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. అప్రూవర్ పేరుతో దస్తగిరికి సిబిఐ మద్దతు ఇస్తోందని, దస్తగిరి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడని, అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు సిబిఐ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణను ఆడియో, వీడియో రూపంలో ఉందని, న్యాయవాది సమక్షంలో చేయాలని అవినాష్ రెడ్డి కోరారని చెప్పారు. దీనిపై కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ప్రసారాలు చేయడం బాధాకరమైన విషయమని, విచారణకు అవినాష్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. సిబిఐపై ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపి అవినాష్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News