- Advertisement -
న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. భ్రదతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలపాలని సూచన చేసింది. స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కల్పించాలని తెలిపింది.
- Advertisement -