Thursday, May 2, 2024

వెనకబడిన వర్గాలకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

Central Scholarships Annual income limit Increase to Rs.2.50 lakhs

కేంద్ర ఉపకార వేతనాల
వార్షిక ఆదాయ పరిమితి
రూ.2.50లక్షలకు పెంపు

లక్షలాది
మంది
విద్యార్థులకు
లబ్ధి
ముఖ్యమంత్రి
కెసిఆర్‌కు
బిసి కమిషన్
కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉపకార వేతనాల లబ్ధికి వీలుగా ఓబిసిలు, వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి రూ.2.50 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలకు పెంచారు. ప్రధానం గా ఓబిసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు ఉండగా, రూ. 2.50 లక్షలకు పెంచారు. డాక్టర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ ఈబిసి స్కాలర్‌షిప్‌కు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు.డాక్టర్ అంబేద్కర్ ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు. విద్యార్థులకు అందజేసే స్కాలర్‌షిప్ పథకాల అమలు కోసం ఈ ఆదాయ పరిమితిని పెంచారు.

వార్షికాదాయం పెంచిన సీఎంకు కృతజ్ఞతలు: కిశోర్‌గౌడ్

బిసి, ఈబిసి, డిఎన్‌టి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడం అభినందనీయమని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కే. కిశోర్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆదాయం రూ.1.50 లక్షలు, ఈబిసిల వార్షికాదాయం లక్షా రూపాయలు, డిఎన్‌టి విద్యార్థుల ఆదాయం రూ. 1.50 ఉండేది. దాన్ని ఓబిసి, ఈబిసి, డిఎన్‌టిల వార్షికాదాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.2.50లకు పెంచారు. విద్యార్థుల వార్షికాదాయాన్ని పెంచుతూ జీఓ జారీ చేయడం వల్ల లక్షలాదిమంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News