Sunday, May 5, 2024

పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపిలు చర్చకు పట్టుబట్టడంతో ఉభయసభలు దద్దరిల్లాయి. దీంతో 141మంది ఎంపిలను సమావేశాలను సస్పెండ్ చేశారు.

అయితే, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్ భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్ విభాగం.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్‌)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకనుంచి ఇక నుంచి పార్లమెంటు భద్రతను సీఐఎస్ఎఫ్‌ పర్యవేక్షించనుంది. కాగా, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో నలుగురు నిందితులకు 15 రోజుల రిమాండ్‌ను ఢిల్లీ కోర్టు పొడిగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News