Sunday, April 28, 2024

చాకలి ఐలమ్మ బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక

- Advertisement -
- Advertisement -

Chakali Ilammma jayanthi celebrations

ఆమె తెగువ తెలంగాణ
పౌరుషాన్ని చాటి చెప్పింది
నేడు ఐలమ్మ జయంతి
సందర్భంగా స్మరించుకున్న
సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొనియాడారు. బహుజన ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ఆయన నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని సిఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News