Monday, September 22, 2025

నయవంచనకు చిరునామా బిఆర్‌ఎస్ : ఎస్‌సి మోర్చా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరబాద్ : అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూన్న బిఆర్‌ఎస్ పాలన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని బిజెపి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష ఆరోపించారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఎస్‌సిమోర్చా జిల్లా అధ్యక్షులు బచ్చిగాళ్ల రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో దళితులను రెచ్చగొట్టుతూ..ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ తీవ్రతను పెంచాడని, తీరా రాష్ట్రం ఏర్పడ్డాక దళితులకు కనీసం మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. దళిత బంధు, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా అనేక విషయాల్లో దళితలను మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోసుపెళ్లి ప్రతాప్, గోగిరెడ్డి లచ్చిరెడ్డి నోముల దయానంద్, ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, మోర్చా అధ్యక్షులు, జిల్లా వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News