Tuesday, April 30, 2024

నితిన్ లేకపోతే ఈ చిత్రం లేదు

- Advertisement -
- Advertisement -

Check movie release on Feb 26

 

నితిన్ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. రకుల్‌ప్రీత్ సింగ్ ఓ కథానాయిక కాగా మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ “నా కెరీర్ గ్రాఫ్‌లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ జోనర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ తరహా యునిక్ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్ యేలేటి చెప్పిన 15 నిమిషాల కథ విని వెంటనే ఈ సినిమాకు అంగీకరించాను. కథలో ఓ పాయింట్ ఫ్రెష్‌గా ఉంది. ‘చెక్’ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. అవుట్‌పుట్ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది” అని అన్నారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ “చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్’ సినిమా ఇతివృత్తం. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకొని దాని మీద పని చేశా. సెకెండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు” అని చెప్పారు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “ఇప్పటి వరకూ నితిన్‌ని లవర్ బాయ్‌గా చూశాం. ఈ చిత్రంలో అతను ఎప్పుడూ చేయని ఓ పాత్ర పోషించారు. సినిమా చూశాక అతని నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం” అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నటుడు సాయిచంద్, సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News