Sunday, April 28, 2024

కుంభ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

Culture traditions guide to world

 

జుబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ’కుంభ సందేశ్ యాత్ర ‘ ను శుక్రవారం హైదరాబాద్‌లో జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అంతకుముందు జుబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె త మాట్లాడుతూ, కరోనా మహమ్మారి లాంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా, భారత సాంప్రదాయాలు పాటించిందని గుర్తు చేశారు. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలను కొత్త తరానికి చేరవేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ సందేశ్ యాత్రనునిర్వహిస్తున్న వసంత్‌ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News