Wednesday, May 1, 2024

ఎవడ్రా నా లవర్‌ని ఏడిపించింది

- Advertisement -
- Advertisement -

Pagal movie Trailer release

 

విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పాగల్’. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహకారంతో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పాగల్’ టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘రేయ్.. ఎవడ్రా నా లవర్‌ని ఏడిపించింది?’ అని విశ్వక్ సేన్ ఓ గ్యాంగ్‌ని ప్రశ్నించడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతూ వచ్చిన హీరో.. చివరకు ఒక బామ్మకు కూడా ప్రపోజ్ చేసి ‘పాగల్’ నేపథ్యాన్ని తెలియజేశాడు. ‘నా లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపించడం లేదురా.. స్ట్రాంగ్‌గా కొట్టండి.. స్ట్రాంగ్‌గా.. వైల్డ్‌గా.. నా లవ్ లా’ అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది. ఇందులో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువే అని టీజర్‌తో హింట్ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News