Wednesday, May 7, 2025

కోల్ కతాకు సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు చెన్నైతో కీలక పోరు

కోల్‌కతా: ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నెలకొంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిస్తేనే కోల్‌కతా నాకౌట్ అవకాశాలు మెరుగు పడుతాయి. చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా జట్టుకు పెద్దగా ప్రయోజం ఉండదు. కానీ నైట్‌రైడర్స్‌కు మాత్రం ఈ పోరు చావోరేవో లాంటిదని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఐదు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ప్రస్తుతం కోల్‌కతా 11 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోల్‌కతా ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగు పడుతాయి.

బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేక పోతోంది. కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, కెప్టెన్ అజింక్య రహానె, రింకూ సింగ్, మోయిన్ అలీ, రఘువంశీ, రసెల్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. నరైన్ ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు.

వెంకటేశ్ అయ్యర్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. రహానె కూడా అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. రింకూ సింగ్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. రసెల్ కూడా నిరాశ పరుస్తున్నాడు. ఒక్క రఘువంశీ మాత్రమే కాస్త మెరుగ్గా ఆడుతున్నాడు. ఇక చెన్నై కూడా అంతంత మాత్రంగానే రాణించింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చెన్నై పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. 11 మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 9 మ్యాచుల్లో ఓడింది. దీంతో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News