Monday, May 6, 2024

చిరపుంజీ రికార్డు స్థాయిలో వర్షపాతం

- Advertisement -
- Advertisement -

Cherrapunji receives record rainfall

న్యూఢిల్లీ: వర్షపాతంలో మేఘాలయాలోని చిరపుంజీ మరో రికార్డును సాధించింది. రెండు రోజుల క్రితమే ఒకే రోజు 811.6 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసుకున్న చిరపుంజీ గడచిన 24 గంటలలో 972మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసుకుని మరో రికార్డు సాధించింది. 1995 జూన్‌లో తర్వాత ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇంత అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గడచిన 122 సంవత్సరాలలో ఇది మూడవసారి. 1901లో భారతీయ వాతావరణ శాఖ(ఐఎండి) ఏర్పడిన నాటి నుంచి జూన్ నెలలో ఒక్కరోజే 800 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం తొమ్మిది సందర్భాలలో జరిగింది. ప్రపంచంలో అత్యధిక తడి ప్రదేశాలలో ఒకటైన చిరపుంజీలో ఈ నెలలో మొత్తం 4081.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండి గువాహటి ప్రాంతీయ కేంద్రం శాస్త్రవేత్త సునీత్ దాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News