Thursday, May 2, 2024

ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి  మంత్రి హరీష్ రావు హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చెట్టు – బొట్టుగా పేరు పెట్టామని, తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనది అని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదని, వ్యాధులు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడంతోనే ఊపిరితిత్తులను కాపాడుకోగలుగుతామని, చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని హరీష్ రావు వివరించారు.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచ్ఛ గోదావరి తాగు నీరు అందిస్తున్నామని, ఆహారం, వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో పంటలను పండించాలని రైతులను హరీష్ రావు కోరారు. హరిత హారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామని, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త వేరడం ఒక మంచి పరిణామం అని అన్నారు. కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలుగుతుందని, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారని కొనియాడారు. జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ బ్యాక్ లో మనం రెండో స్థానంలో ఉన్నామని,  కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, సిబ్బంది అందరం కలిసి కష్ట పెడితే మొదటి స్థానంలో ఉంటామని హరీష్ రావు పిలుపునిచ్చారు. మొక్కలు పంచడమే కాదు నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు సిబ్బంది ప్రజలకు తెలియజేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News