Sunday, September 15, 2024

అది క్లౌడ్ బరస్ట్ కావొచ్చు

- Advertisement -
- Advertisement -

38 ఏళ్ల సర్వీసులో ఇలాంటి విపత్తు చూడలేదు
మరో ఐదేళ్లలో అడవిని యధావిధిగా చూడవచ్చు 
పది రోజుల్లో సర్వే పూర్తి చేసి ఒక నిర్ధారణకు వస్తాం: చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్

మన తెలంగాణ/తాడ్వాయి: ములుగుజిల్లా, తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో వాతావరణ మార్పులతోనే (క్లౌడ్ బరస్ట్ గెయిల్స్) వల్ల అడవి విధ్వంసమైందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్‌ఎం డోబ్రియాల్ తెలిపారు. గత నెల 31వ తేదీ రాత్రి కురిసిన అధిక వర్షపాతంతో పాటు తీవ్రమైన గాలులకు దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గానికి ఇరువైపులా సుమారు 500 ఎకరాల్లో 50 వేల చెట్లు నేలకూలిపోయాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, జడివానతో తాడ్వా యి మండలం, మేడారం మార్గమధ్యలో సుమారు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వివిధ రకాల వృక్షా లు నేలకూలిన ప్రాంతాన్ని పిసిసిఎఫ్‌ఓ, ఆర్‌ఎం డో బ్రియాల్‌తోపాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల అటవీ అధికారులు బుధవారం పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన 37 ఏళ్ల సర్వీసులో ఈ పరిస్థితి.. ఇ లాంటి విపత్తు చూడలేదని చూడలేదని వ్యాఖ్యా నిం చారు. ఒకేసారి అధిక మొత్తంలో వర్షపాతం రావడంతోనే అడవి విధ్వంసమైందని అన్నారు. మరో ఐ దేళ్లలో అడవిని యధావిధిగా చూడవచ్చని, పది రో జుల్లో సర్వే పూర్తిచేసి ఒక నిర్ధారణకు వస్తామన్నారు. ఈ ప్రాంతంలో మంచి నేల ఉందని, కొన్ని చెట్లు ఒక్క ఫీటు వరకు భూమిలోకి వేర్లు వెళ్లాయని, దీంతో గాలి నలుదిశల నుంచి రావడంతో చెట్లు కూలిపోయాయని, కొమ్మలు విరిగిపోయాయని తెలిపారు. పలు రకాల చెట్లు వేర్లతో సైతం పడిపోయాయని అన్నారు. పైననే మినరల్స్ దొరకడం వల్ల వేర్లు లోతుగా భూమిలోకి వెళ్లలేదన్నారు. దీనిపై మెట్రోలాజికల్ డిపార్టుమెంటు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సంస్థలతో సర్వే చేయించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

దీనిపై స్పెషల్ రిపోర్టు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సమర్పిస్తామని అన్నారు. ప్రస్తుతం వర్షాలు ఉన్నందున పూర్తి సర్వే డ్రోన్ల ద్వారానే పరిశీలించి 500 ఎకరాల్లో 50 వేల చెట్లు కూలిపోయినట్లు తెలుసుకున్నామని, మరో పది రోజుల్లో పూర్తి సమాచారం తెలుసుకుంటామని అన్నారు. ఈ ప్రదేశంలో సహజంగానే చెట్లు పెరుగుతాయని, నేల బాగుందని, ఐదేళ్లలో భారీగా అడవి పెరుగుతుందని అన్నారు. ఆయన వెంట కాళేశ్వరం, భద్రాద్రి కొత్తగూడెం సిసిఎఫ్‌ఓలు, ప్రభాకర్, భీమనాయక్‌తోపాటు డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్, స్థానిక ఎఫ్‌డిఓ వజ్రరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓలు సత్తయ్య, కృష్ణవేణి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News