Friday, May 3, 2024

భారత్‌లో యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

- Advertisement -
- Advertisement -

China concerned over ban on apps in India

బీజింగ్: భద్రతా కారణాలతో తమ దేశానికి చెందిన యాప్‌లను భారత్ నిషేధించడం పట్ల చైనా గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందరినీ భారత్ పారదర్శకంగా, వివక్ష లేకుండా సమానంగా చూస్తుందని ఆశిస్తున్నట్లు చైనా తెలిపింది. చైనా, భారత్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సహకారం అభివృద్ధి పథంలో కొనసాగేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గవో ఫెంగ్ గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఇటీవల 54 మొబైల్ యాప్‌లను ముఖ్యంగా చైనాకు చెందిన వాటిని నిషేధించినట్లు ఇక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News