Friday, May 3, 2024

కోవాక్స్ కూటమిలో చేరిన చైనా

- Advertisement -
- Advertisement -

China joined COVAX alliance

బీజింగ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) సారధ్యంలోని కోవాక్స్ కూటమిలో చైనా ఇప్పుడు అధికారికంగా చేరింది. కరోనా చికిత్సకు రూపొందే వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ సమతూకతతో పంపిణీ చేసేందుకు సరైన ఏర్పాట్లు ఉండాలని పేర్కొంటూ డబ్లుహెచ్‌ఒ కోవాక్స్ కూటమిని ఏర్పాటు చేసింది. పలు దేశాలూ ఈ కూటమిలో చేరాయి. వైరస్ పుట్టిల్లు అయిన చైనా ఈ అలయెన్స్‌లో చేరకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో కూడా చైనా తన దౌత్య అజెండానే పాటిస్తుందని, తగు ప్రయోజనాలు పొందేలా తాను ఎంచుకున్న కొన్ని వర్థమాన దేశాలకే ఈ వ్యాక్సిన్‌ను సొంత అజెండాతో పంపిణీ చేస్తుందని, కూటమిలో చేరనే చేరదని వార్తలు వెలువడ్డాయి.

అయితే వీటికి ఫుల్‌స్టాప్ పెడుతూ చైనా ఈ కూటమిలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన తమ దేశం కోవిడ్ 19 వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్ ఫెసిలిటి (గవి)తో తగు ఒప్పందం కుదుర్చుకుందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి హూవా ఛూన్యింగ్ ఓ ప్రకటన వెలువరించారు. కోవాక్స్ కూటమిలో చేరేందుకు ప్రపంచదేశాలకు సెప్టెంబర్ 18 తుది గడువు పెట్టారు. కొన్ని అదనపు చెల్లింపుల ప్రాతిపదికన ఖరారు చేసిన గడువు శుక్రవారం ( అక్టోబర్ 9)తో ముగిసింది.

China joined COVAX alliance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News