Monday, May 13, 2024

ఖా’కీ’చకుడు లొంగుబాటు..

- Advertisement -
- Advertisement -

ఖాకీచకుడు లొంగుబాటు
మొదటిపేజీ తరువాయి
నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు.
బోల్తా కొట్టించిన బాధితురాలి భర్త…

మన తెలంగాణ/సిటీబ్యూరో: అత్యాచారం, కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు రాచకొండ ఎస్‌ఓటి డిసిపి ఎదుట ఆదివారం లొంగిపోయా డు. తనపై నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా తన భర్తను చంపివేస్తానని రివాల్వర్‌తో బెదిరించాడని బాధిత మహిళ వనస్థలిపురం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్ కోసం గాలింపు చేపట్టారు. అప్పటి నుంచి రెండు రోజులు పరారీలో ఉన్న మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎట్టకేలకు రాచకొండ ఎస్‌ఓటి డిసిపి ఎదుట లొంగిపోయాడు. వనస్థలిపురం, వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న మహిళపై నాగేశ్వరరావు ఈ నెల 7వ తేదీన అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమె భర్తను గన్‌ను తలపై పెట్టి చంపివేస్తానని బెదిరించాడు. తర్వాత ఇద్దరిని కారులో నాగార్జునసాగర్ రోడ్డు వైపు తీసుకుని వెళ్తుండగా ఇబ్రహీంపట్నం కట్టపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కారులో నుంచి బాధిత మహిళ, భర్తతో కలిసి బయటపడి అక్కడి నుంచి పారిపోయి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు దృష్టి మరల్చి కారును బోల్తా కొట్టించాడు. తన మొబైల్ ఫోన్ లొకేషన్‌ను నాగేశ్వరరావు ట్రాక్ చేస్తున్నట్లు తెలుసుకున్న బాధితురాలి భర్త దానికి తగ్గట్లుగా ప్లాన్ వేశాడు. లోకేషన్ ద్వారా తాను ఇంట్లో లేని సమయంలో తన భర్య వద్దకు వచ్చి వెళ్తున్నట్లు తెలుసుకున్నాడు. ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే తన మొబైల్ ఫోన్‌ను దేవరకొండ ఇంట్లో పెట్టి వనస్థలిపురానికి వచ్చి ఇన్‌స్పెక్టర్ కోసం వేచిచూశాడు. బాధితురాలి భర్త మొబైల్ ఫోన్ లోకేషన్ చూసిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు బాధితురాలి భర్త దేవరకొండలో ఉన్నట్లు భ్రమపడి వనస్థలిపురంలోని బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఇది చూసిన బాధితురాలి భర్త ఇంట్లోకి వచ్చి నాగేశ్వరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ భాగోతం వెలుగుచూసింది.

CI Nageshwar Rao Surrendered

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News