Saturday, April 27, 2024

సింహవాహిణికి సిటీ కళాశాల విద్యార్థుల బోనాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : పాతబస్తీ హైకోర్టు సమీపంలోని ప్రభుత్వ సిటీ కళాశాల ఏబీవీపీ విద్యార్థులు గురువారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించారు. యువతీ యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి తెలంగాణ సంస్కృతిని చాటేలా తలపై బోనంతో ఊరేగింపు నిర్వహించారు. లాల్‌దర్వాజా మోడ్ నుండి బ్యాండు మేళాలతో పోతరాజుల వీరంగం మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవున పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

వందలాది మంది విద్యార్థులు తరలి రాగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద చైర్మన్ సి.రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి.మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, మాజీ చైర్మన్లు కె.వెంకటేష్, విష్ణుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మాణిక్‌ప్రభు గౌడ్ తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి చిందేశారు. దీంతో ఆలయ పరిసరాలు విద్యార్థినుల సాంప్రదాయ బోనాలు, యువకుల నృత్యాలతో కిక్కిరిసింది. అనంతరం వారు ఆలయంలో అమ్మవారికి సాంప్రదాయ బోనాన్ని సమర్పించి వేపాకునీళ్ళతో సాకపెట్టారు. అమ్మను దర్శించుకున్న విద్యార్థులకు నిర్వాహకులు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు బి.నితిన్, జి.వాసు, దిలీప్, కల్యాణ్, అనూష, సింధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News