Friday, April 26, 2024

తెలంగాణ పునర్ నిర్మాణం అంటే కాళేశ్వరమే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పునర్నిర్మాణం అంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు నాలుగు మాటలు చెప్పదలచుకున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పునర్నిర్మాణం అంటే నాడు సమైక్య పాలనలో చిక్కిశల్యమైపోయి, శిథిలమైపోయి రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కోల్పోయి అద్భుతమైన కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మాణమైన చెరువులను పునరుద్ధరించి ఎండాకాలంలో కూడా మత్తల్లు దుంకే చెరువులే పునఃనిర్మాణానికి భాష్యంగా ప్రస్తుతం నిలిచాయన్నారు.

ఉద్యమం సందర్భంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా నదీమాతకు నాణేలు వేసి రెండుచేతులు జోడించి దండంపెట్టి తల్లీ మా భూమి మీదకు ఎప్పుడు వస్తవ్? మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాడినని కెసిఆర్ తెలిపారు. నాటి సమైక్య రాష్ట్రంలో దుస్థితి ఏంటంటే గోదావరి డబ్బులు, రాగి నాణేలు వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కొని రామగుండం వద్ద బిడ్జి మీద నుంచి నడిచి ఎక్కడ చిన్నపాటి గుంతలో నీళ్లు కనిపిస్తే వేసే వాడినన్నారు. ఈ రోజు రామగుండానికి వెళ్తే కళ్ల ముందే నీళ్లు కనబడుతున్నా యన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఇరిగేషన్ చీఫ్ సెక్రెటరీల ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాజ్టెకు శిఖరాయమానంగా ప్రపంచానికే తలమానికంగా వెలిగిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News