Tuesday, April 30, 2024

ఢిల్లీ గద్దెపై రాబోయేది మన ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

CM KCR fired on BJP in Nizamabad public meeting

దేశంలో రైతులకు ఉచిత విద్యుత్
నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థావం మొదలు పెడుతా
బిజెపి ముక్తు భారత్ నాలక్షం
నిజాంసాగర్ కాల్వలో నీరు పారలా? రక్తం పారాలా?
నిజామాబాద్ బహిరంగ సభలో బిజెపి పై నిప్పులు చెరిగిన సియం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నట్లు సియం కెసిఆర్ ప్రకటించారు. బిజెపి ముక్తు భారత్ నినాదాన్ని స్పూర్తిగా తీసుకొని 2024 ఎన్నికల్లో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణలో ఇస్తున్నట్లుగానే యావత్తు దేశ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ గడ్డ లక్ష్మి గడ్డ నుంచి రైతులకు ఒక తీయటి మాట చెబుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.

సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కాలేజి మైదానంలో భారీగా తరలి వచ్చిన ప్రజానీకానిన ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బిజెపి పాలనలో దేశం అన్ని రంగాలలో అదోగతి పాలైందని విమర్శించారు. మత పిచ్చితో పచ్చని పంట కాల్వల్లో నీళ్ళు పారేలా కాకుండా రక్తం పారేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత పిచ్చితో ప్రజలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, గతంలో తెలంగాణ ఎంత ఆగమైందో తనకు తెలుసు అన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం ఉండాలని అప్పుడు ప్రజలు బాగుండాలని సియం కెసిఆర్ అన్నారు. బిజెపిని ఇంటికి సాగపంపి బిజెపి ముక్తు భారత్ కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం పచ్చిమోసం చేస్తుందని, ఎమ్మెల్యేలను సంతలో పశువులా కొని ప్రభుత్వాలను కూల్చుతుందని అన్నారు.

ప్రతిపక్షాలపై కుట్ర రాజకీయాలు చేసి ప్రభుత్వాలను కూల్చుతూ బలుపు రాజకీయాలు చేస్తుందని తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూడ్చుతామని పేర్కొంటున్నారని సియం అన్నారు. దేశంలో లౌకిక ప్రభుత్వం రావాలని కుట్రలు చేసి కూల్చే ప్రభుత్వాలు వద్దని అన్నారు. దేశంలో అన్ని రైతు సంఘాలు తెలంగాణకు వచ్చి తమ పాలనను కోరుకుంటున్నాయని, ఇక్కడి సంక్షేమ పథకాలను అమలు చేయాలని విన్నవిస్తున్నాయని, దేశ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వనిస్తున్నాయని అన్నారు. కేంద్రం అన్ని రంగాలలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశం గర్వించ రాష్ట్రంగా ముందుకుసాగుతుందని పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ పాలనను అభినందిస్తున్నారని అన్నారు. దేశం మొత్తంలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతాంగానికి, గృహ అవసరాలకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.

ఎన్నో ఏళ్ళుగా అణిచివేయబడ్డ దళిత బిడ్డల కోసం 10 లక్షలు ఇచ్చి దళిత బంధు అమలు చేస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పథకం లేదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్, 5లక్షల భీమా, రైతుబంధు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వామన్నారు. రాష్ట్రంలో జిడిపి పెరిగిందని తలసరి ఆదాయం పెరిగిందని, గతంలో 200 పింఛన్లు ఇస్తే ఈరోజు 2016 ఇస్తున్నామని సియం కెసిఆర్ అన్నారు. సియం సహాయనిధిని అడిగిన వారందరికి ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం రైతాంగంతో కళకళలాడుతుందని, ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వం పెట్టుబడి ఇస్తుందన్నారు. శ్రీరాంసాగర్ వరద కాల్వకు గతంలో మోటార్లు బిగిస్తే కేసులు పెట్టే వారని, ఇప్పుడు అడిగే వారు ఉన్నారని రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నామన్నారు.

నరేంద్రమోడీ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టామంటున్నారని, బిజెపి ప్రభుత్వానికి రైతులు మీటర్లు పెట్టాలని సియం కెసిఆర్ అన్నారు. దేశంలో బ్యాంకులు, ఓడ రేవుళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను అన్ని అమ్ముకున్నారని,ఇంకా రైతుల భూములే మిగిలాయని వాటిని అమ్ముకునేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయనాన్ని అస్తవ్యస్తం చేసి రైతుల భూములను లాక్కొని మోడీ దోస్తులైన కార్పొరేట్ దిగ్గాజాలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపద 12లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట దిగ్బాజాలకు మోడీ దోచిపెట్టారని విమర్శించారు. కరెంటు మాఫీ 20.8 శాతం ఉందని దీన్ని విలువ 1లక్షా 45 కోట్లు మాత్రమేనని ఇవి మాఫీ చేయకుండా కార్పొరేట్ దోస్తులకు లక్షల కోట్లు కట్టబెడుతున్నారని, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ గడ్డ మీద గులాబీ జెండా ఎగురాలని, సముద్రం ఊప్పొంగినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో అలాగే దేశాన్ని కాపాడుకుందామన్నారు.

ఏ దేశానికి లేని వరం మన దేశానికి ఉందని, 83 కోట్ల ఎకరాల భూభాగంలో 41 కోట్ల ఎకరాల భూ భాగంలో సాగు భూమి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో, సమాజంలో ఉన్న వారు పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా వివరించాలని, గతంలో చేసిన పొరపాటు వల్లనే అలసత్వం వల్లనే తెలంగాణను ఆంద్రాలో కలుపారని గుర్తు చేశారు. ఎందరో చావుల తర్వాత నేను చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణను సాధించానని మళ్ళీ పొరపాటు జరగకూడదని అన్నారు. నిజాంసాగర్ నిర్మించి నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తే సింగూరు రూపంలో ఎడారిగా మారిందని, నిజాంసాగర్ కోసం ఎన్నో ఆందోళనలు చేశామని తాను స్వయంగా పాల్గొన్నానని సియం కెసిఆర్ అన్నారు. త్వరలోనే కాళేశ్వరం కాల్వలు సింగూరు ప్రాజెక్టు వరకు వస్తాయని, జిల్లాలో ఒక గుంట భూమి కూడ ఖాళీగా ఉండదని సియం కెసిఆర్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ భవనంలో ఇందూరు కళాభారతి పేరిట ఎసి ఆడిటోరియాన్ని వంద కోట్లతో నిర్మించనున్నట్లు సియం కెసిఆర్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలను అదనంగా ఇవ్వనున్నట్లు సియం కెసిఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్‌షిండె, షకీల్, జాజాల సురేందర్, బిగాల గణేష్ గుప్తా, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, విద్యాసాగర్ రెడ్డి, ఎంపి బీబీ పాటిల్, మేయర్ దండునీతు కిరణ్, టిఆర్‌ఎస్ నాయకులు ఆకుల లలిత, పోచారం భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, రాజేశ్వర్‌రావు, కౌశిక్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రాంకిషన్‌రావు, మార గంగారెడ్డి, ముజీబుద్దిన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News