Home తాజా వార్తలు ఎల్బీనగర్ లో టిమ్స్ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ భూమిపూజ

ఎల్బీనగర్ లో టిమ్స్ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ భూమిపూజ

CM KCR foundation stone for Tims Hospital in LB nagar

 

హైదరాబాాద్: ఎల్బీనగర్ లో టిమ్స్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. ఎల్బీనగర్ గడ్డిఅన్నారం వద్ద 21.36 ఎకరాల్లో 11 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నలుమూలల ఎయిమ్స్ తరహా ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనుంది సర్కార్. ఒక్కో ఆస్పత్రిలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉండనున్నాయి. టిమ్స్ ఆస్పత్రుల్లో 30 రకాల వైద్య విభాగాలకు చోటు కల్పించారు. 16 రకాల స్పెషాలిటీ పిజి కోర్సులు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.