Friday, June 9, 2023

31న బ్రాహ్మణ భవనం ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెల 31న బ్రాహ్మణ భవనంను ప్రారంభిస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు డైరెక్టర్ జోషి గోపాల శర్మ తెలిపారు. “ విప్రహిత” పేరుతో హైదరాబాద్ గోపన్‌పల్లిలో 6 ఎకరాల స్థలంలో రూ. 12 కోట్లతో అధునాతన పద్దతిలో బ్రాహ్మణ భవనం నిర్మించి ఇస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్ వద్ద బ్రాహ్మణులు రాఘవేంద్ర శర్మ తదితరులతో కలిసి గోపాల శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. సువిశాలమైన 5 భవనాలతో ఏర్పాటు చేసిన ఈ భవనం ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు హాజరై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణ స్థితిగతులు ఎంతగానో బాగుపడ్డాయన్నారు. బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉండాలని ఆనాడే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 2016లోనే బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ బ్రాహ్మణ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. బ్రాహ్మణుల బిడ్డలకు విదేశీ విద్యకు రూ. 20 లక్షలు ఇచ్చారని, తమ కుటుంబాలను టిఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక వేత్తలు కావడానికి కూడా నిధులు ఇచ్చారన్నారు. ధర్మాన్ని కాపాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధూపదీప నైవేద్యం పథకం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలోనూ తమ బ్రాహ్మణులను కూడా ఆదుకుంటున్నారన్నారు. హిందూ ధర్మంను పరిరక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ .. రాష్ట్ర ప్రజానీకం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ యజ్ఞ యాగాలు చేశారని ఆయన పర్కొన్నారు.

12 ఏళ్లకు ఒక సారి వచ్చే పుష్కరాలు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయవాడ, రాజమండ్రి వెళ్ళేవాళ్ళమని, కానీ రాష్ట్రం వచ్చాక భద్రాచలం,బాసర, గద్వాల్, బిచూపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే యాదాద్రి ఆలయంను పునరుద్ధరణ చేసి ప్రపంచ దేశాల దృష్టిని తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించిందన్నారు. కొండగట్టు, వేములవాడ ఆలయాల పునరుద్ధరణ పనులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News