Tuesday, March 5, 2024

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

మెదక్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతనంగా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న పల్లె దవాఖాన, రూ10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీకమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ మండల పరిధిలోని మల్కాపూర్ తండాలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి, మల్కాపూర్ నుంచి స్కూల్ తండాకు వెళ్లే దారిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు పూజ చేశారు.

అనంతరం రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠదామం, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ్దిలో పరుగులు పెడుతుందన్నారు. సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్నాడన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్ది చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్యరెడ్డి, మెదక్ ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, పంచాయతీ రాజ్ డీఈ పాండురంగారెడ్డి, హవేళిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మండల రైతుబంధు అధ్యక్షుడు కిష్టయ్య, సర్పంచ్‌లు చెన్నాగౌడ్, యామిరెడ్డి, సరోజ మోహన్, యశోద రంజా, సుంకరి నర్సింలు, మాధవి రవి, ఎంపీటీసీలు అర్చన శ్రీనివాస్, శ్రీహరి, మల్కాపూర్ తండా ఉప సర్పంచ్ చక్రం, మెదక్ మార్కెట్ డైరెక్టర్ సాప సాయిలు, పీఆర్‌ఏఈ సల్మాన్, ఎంపీడీవోలు శ్రీరామ్, ప్రశాంత్, నాయకులు బాలరాజు, సతీష్‌రావు, మేకల సాయిలు, సిద్దిరెడ్డి, బిక్షపతిరెడ్డి, నార్ల సాయిలు, శ్రీనివాస్, గట్టయ్య, రవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News