Monday, May 13, 2024

పెండింగ్ సిఎమ్‌ఆర్ సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : సిఎమ్‌ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పె ండింగ్ సకాలంలో పూర్తి చేయాలని రైస్ మిల్లర్‌లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎమ్‌ఆర్) డెలివరీ ప్రక్రియ పై మిల్లర్లు, ఎఫ్.సి. ఐ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సిఎమ్‌ఆర్ పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. 2022-/23 యాసంగి, వానా కాలం సీజన్ కింద 11 లక్షల 12 వేల 75 మెట్రిక్ టన్నుల వడ్లను జిల్లాలోని 143 రైస్ మిల్లులకు ఇచ్చామన్నారు. 5 లక్షల 65 వేల 973 మెట్రిక్ టన్నుల లేవీ బియ్యం మిల్లర్ల నుండి ఎ ఫ్.సి.ఐకి రావాల్సి ఉందన్నారు.

ఇప్పటివరకు ఒక లక్ష 86 వేల 3 5 మెట్రిక్ టన్నుల లేవీ బియ్యం వచ్చిందన్నారు. మన జిల్లాలో ప్రతిరోజు 4500ల మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాలన్నారు. ఇందు కో సం అన్ని మిల్లుల యాజమాన్యాలు చొరవ తీసుకొని వేగవంతం చే యాలని ఆయన కోరారు. అవసరమైతే కొత్త గోడౌన్లు గుర్తించాలని లేదా కొత్తవి ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లింగ్ కెపాసిటీ ఉన్నా ఎందుకు మిల్లింగ్ చేయడం లేదని మండలాల వారిగా రైస్ మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. మిల్లింగ్ వేగవంతం చేయడానికి హమాలీ వర్కర్ల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ ను కోరారు.

అవసరమైతే డెలివరీ టైమ్‌ను పెంచాలన్నారు. పౌర సరఫరాల అధికారులు క్షేత్రస్థాయిలో మిల్లులలో నిలువ ఉన్న దాన్యమును పరిశీలించి నివేదికల సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వము నిర్దేశించిన గడువులోగా మిల్లర్లు అందరూ సిఎమ్‌ఆర్ డెలివరీ చేయాలన్నారు. సిఎమ్‌ఆర్ డెలివరీ చేయని మిల్లులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వరరావు, ఎఫ్సీఐ డీఎం వరుణ్ సూద్, మిల్లర్ల సంఘం నల్లగొండ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరీ శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News