Monday, April 29, 2024

రాష్ట్రంలో మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ఆదివారం కామారెడ్డి జిల్లా మల్లన్న గుట్ట సమీపంలోని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వద్ద మంచినీళ్ల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యథితిగా ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ హాజరై మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజలు సురక్షితమైన నీటిని తాగడం వల్ల వ్యాధులు రావడం లేదని తెలిపారు.

గతంలో తెలంగాణ రాకముందు తాను ఏగ్రామానికి వెళ్లిన మహిళలు రోడ్డుకు అడ్డం బిందెలు పెట్టి నీటి ఎద్దడిని తీర్చాలని ఆందోళన చేపట్టేవారని అన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచించి ఇంటింటికి మంచినీటిని అందించారని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి శాశ్వతంగా పరిస్కారం జరిగిందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ప్రజలకు వరం మిషన్ భగీరథ జలం : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
తెలంగాణ రాకముందు మహిళలు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే వారని, కరెంట్ సమస్య ఉంటే ఇబ్బందులు పడేవాళ్లని అన్నారు. తాడ్వాయి మండలంలో నీటి ఎద్దడి అధికంగా ఉండేదని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని వృధా చేయొద్దని సూచించారు. తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. వేసవిలో సైతం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. ప్రజలకు మిషన్ భగీరథ జలం వరంలా మారిందని ఎమ్మెల్యే సురేందర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంచినీళ్ల పండుగ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్లను సరాఫరా చేయడానికి ప్రతినిత్యం పని చేస్తున్న గ్రామ స్థాయి లైన్మెన్ నుంచి జిల్లా స్థాయి అధికారుల కృషిని గుర్తించాలని చెప్పారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. అనంతరం మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ప్రజాప్రతినిధులు, అధికారులు,మహిళలు సందర్శించారు. శ్రీరాంసాగర్ నుంచి వచ్చే నీటిని శుద్ధ్ది చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అధికారులు వివరించారు.

సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జడ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, జడ్పి కోఆప్షన్ సభ్యుడు యోయినొద్దిన్, ఆడబ్లూ ఎస్‌ఈఈ లక్ష్మీనారాయణ, డిఈ రమేష్, ఏఈ శ్రీధర్, సదాశివనగర్ ఎంపిపి అనసూయరమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, వైస్ చైర్మన్ స్థానిక సర్పంచ్ సంగారెడ్డి, రైతుబంధు మండల అద్యక్షుడు భూంరెడ్డి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ నాయక్, మండల అద్యక్షుడు మహెందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, సిడిసి ఐకేని నర్సింలు, ఆయా మండలాల ఎంపిపిలు, జడ్పిటిసీ,ఎంపిటిసీలు, సింగిల్విండో అద్యక్షులు, సర్పంచ్లు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News