Thursday, May 2, 2024

జెపిఎస్‌లకు వరం

- Advertisement -
- Advertisement -

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును
క్రమబద్ధీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం
విధివిధానాలను ఖరారు చేయాలని
సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు
జెపిఎస్‌ల పనితీరును మదింపునకు
జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
మనతెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సిఎం కెసిఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సిఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్‌పి లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్‌ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.

రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని నియమిస్తారు. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించిన ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారని, ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సిఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News