Sunday, April 28, 2024

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని తెలిపారు.

మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవు తుందన్నారు. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News