Thursday, May 2, 2024

నిరుపేదలకు సిఎం సహాయనిధి సంజీవని: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో ఏ పథకం కూడా ఆగకుండా పకడ్భందిగా అమలవుతున్నాయని బిసి సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారు చికిత్స పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా సిఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు.  లబ్దిదారులకు సిఎం రిలీప్ ఫండ్ చెక్కులను గంగుల కమలాకర్ పంపిణి చేశారు. నిరుపేదలు ఆకలితో అలమటించరాదనే సంకల్పంతో సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని,  సిఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవని లాంటిదని  పేర్కొన్నారు. నేడు హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు 3,19,000 రూపాయల విలువజేసే చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడారు.    అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ చేపడుతున్న పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఓ వైపు కరోనా సంక్షోభంతో యావత్ ప్రపంచమే స్థంభించిపోయినప్పటికీ తెలంగాణలో మాత్రం పథకాలు పకడ్భంధీగా సిఎం కెసిఆర్ అమలు చేశారని గంగుల ప్రశంసించారు. ఏ పథకం కూడా ఆగకుండా నిరాటంకంగా కొనసాగుతున్నాయని, తెలంగాణలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా ఉండాలనేదే సిఎం కెసిఆర్ సంకల్పమన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సిఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. సిఎం సహాయనిధితో ఎంతోమంది తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక – శ్రీనివాస్ ,కొలిపాక నిర్మల – శ్రీనివాస్ లు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News