- Advertisement -
అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇటీవల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డును సౌమ్య అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆటలో చూపిస్తున్న ప్రతిభను సిఎం ప్రశంసించారు. మంగళవారం సిఎం రేవంత్‌రెడ్డిని క్రీడాకారిణి సౌమ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.మహ్మద్ అలీ రఫాత్, ప్రధాన కార్యదర్శి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -