Monday, April 29, 2024

రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ సూచించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీరాముని జీవితం మనకు ఆదర్శం: మంత్రి కొండా సురేఖ
ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీరామనవమి పండుగ (ఏప్రిల్ 17)ను పురస్కరించుకుని మంత్రి సురేఖ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ఆచరించి చూపిన జీవన ప్రమాణాలు జీవితంలో మనకు ప్రతి దశలోనూ స్ఫూర్తినిస్తాయని ఆమె తెలిపారు. సీతారాముల ఆదర్శ జీవితం భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News