Sunday, October 6, 2024

నెహ్రూ.. దేశం కోసం రూ. వేల కోట్ల సంపదను త్యాగం చేశారు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ
విగ్రహావిష్కరణలో సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఏఐసీసీ ఇన్‌ఛార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

అనంతరం మాట్టాడిన సీఎం రేవంత్‌ రెడ్డి.. “త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. రూ. వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు నెహ్రూ. స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన చరిత్ర నెహ్రూది.నెహ్రూ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ బాధ్యత తీసుకోవలేదు. కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందుతారు. బ్యాంకులను ప్రభుత్వపరం చేసి పేదలకు మంచి చేశారు.. ఇందిరా గాంధీ” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News