Wednesday, April 17, 2024

రేపు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని గురువారం రాత్రికి కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన జగన్ బస్సు యాత్ర శుక్రవారం ఉదయం అక్కడి నుంచే నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు.

రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ మీదుగా కెజిఎన్ ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైఎస్‌ఆర్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News