Friday, May 3, 2024

ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ‘డూన్’

- Advertisement -
- Advertisement -

 

CODA

ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న ‘సిఒడిఎ’

లాస్ ఏంజిల్స్: 94వ అకాడమీ అవార్డులు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగాయి. రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు ఆతిధేయులుగా వ్యవహరించారు. ‘సిఒడిఎ’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా మూడు విభాగాల్లో నామినేట్ అయి మూడింటిలోనూ విజయం సాధించింది. మిగిలిన ఆ రెండు..ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడుకు లభించాయి. ఆస్కార్స్ పది నామినేషన్లలో ఆరు అవార్డులను గెలుచుకుంది ‘డూన్’. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను ఆ చిత్రం గెలుచుకుంది. ఇక 12 నామినేషన్లను సొంతం చేసుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ కేవలం ఒకే ఒక అవార్డును గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడి అవార్డును జేన్ క్యాంపియన్ గెలుచుకున్నారు.
విల్ స్మిత్ తన కెరీర్‌లోనే మొదటి ఆస్కార్ అవార్డును ‘కింగ్ రిచర్డ్’ చిత్రం నటనకు గెలుచుకున్నారు. ఇక ‘ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్’ చిత్రానికిగాను జెస్సికా చస్టెయిన్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా ‘వైస్ట్ సైడ్ స్టోరీ’కి అరియానా డిబోస్ గెలుచుకున్నారు. ప్రత్యక్ష ప్రసారానికి ముందు ఎనిమిది విభాగాలు ఆస్కార్‌లను అందుకున్నాయి. అయినా వాటి విజయాలు టెలికాస్ట్‌లో చేర్చారు. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ మేకప్ మరియు హెయిర్ స్టయిలింగ్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ వంటి వాటికి సంబంధించిన అవార్డులు ప్రత్యక్ష ప్రసారం కాలేదు.

Will Smith

కామేడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించిన విల్ స్మిత్
94వ అకాడమీ అవార్డ్/ ఆస్కార్ షో సందర్భంగా ఓ పెద్ద సంఘటనే జరిగింది. నటుడు విల్ స్మిత్ స్టేజ్ మీదకు నడుచుకుంటూ వెళ్లి కామేడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. లైవ్ షోలో ఇది చూస్తున్న ప్రేక్షకులు ఈ ఘటనకు స్టన్ అయిపోయారు. విషయం ఏమిటంటే విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ బోడితలపై క్రిస్ రాక్ హాస్యోక్తులాడాడు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జిఐజేన్’ చిత్రంలో ‘డెమి మూర్’ ప్రదర్శించిన పాత్రతో పోల్చాడు. ‘జిఐజేన్ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా?’ హాస్యమాడబోయాడు. వాస్తవానికి పింకెట్ ‘అలోపేసియా’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధి కారణంగా జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఆమె ఇదివరకే బహిరంగంగా చెప్పారు.
స్మిత్ కొట్టేసి వెనక్కి వచ్చిన తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై ‘నా భార్య పేరు నీ నోటి నుంచి మళ్లీ రావొద్దు’ అంటూ రెండు సార్లు గట్టిగా హెచ్చరించాడు. అసలు విషయాన్ని గమనించిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. స్మిత్ హెచ్చరికకు ‘ఓకే’ అని చెబుతూనే ‘టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప రాత్రి’ అని క్రిస్ రాక్ అన్నాడు. ఆ తర్వాత వేదిక మీదికి వచ్చిన సీన్ కోంబ్స్ వారిద్దరిని సముదాయించారు.
ఈ ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత ‘ఉత్తమ నటుడి’గా అవార్డును అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు. జరిగిన ఉదంతంపై సహచర నామినీలకు క్షమాపణలు చెప్పాడు. అయితే క్రిస్ రాక్ పేరును మాత్రం మళ్లీ ప్రస్తావించలేదు. అవార్డును అందుకుంటున్న సమయంలో స్మిత్ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇక ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో టెన్నీస్ క్రీడాకారిణిలు వీనస్, సెరెనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ పాత్రలో స్మిత్ కనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News